GHMC : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో జరిగిన లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం పోలింగ్ శాతం 78.57 గా నమోదైంది. ఉదయం ప్రారంభమైన ఓటింగ్ నిరాటంకంగా కొనసాగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 88 ఓట్లు నమోదు అయ్యాయి. అందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ప్రారంభమైన పోలింగ్ సజావుగా కొనసాగి సాయంత్రం 4 గంటలకు…
Konda Vishweshwar Reddy : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు ముదురుతున్నాయి. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి AIMIM, కాంగ్రెస్, BRS పార్టీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. BBP అనే కొత్త పదాన్ని విపక్షాలకు ఆయన బిరుదుగా ఉపయోగించారు. BBP అంటే భాయ్ భాయ్ కే పార్టీ, బాప్ బేటే కే పార్టీ, బాప్ భేటి కి పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇవన్నీ AIMIM, కాంగ్రెస్, BRSలకే సూచిస్తాయని ఎద్దేవా చేశారు.…
Asaduddin Owaisi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ముస్లింలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ చేస్తున్న చర్యలను తీవ్రంగా విమర్శించారు. సభలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఒవైసీ మాట్లాడుతూ, “అందరూ మీ ఫోన్‌లలో లైట్లు ఆన్ చేయండి. మీరు వెలిగించినది ఫోన్ లైట్ కాదు… బీజేపీ నాయకుల మెదళ్లలో వెలిగించిన తెలివి,” అన్నారు. ప్రధాని మోడీ గత 11 ఏళ్లుగా…
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మజ్లిస్ పార్టీకి బానిసలుగా మారిపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మజ్లిస్ మెప్పు కోసమే ఇతర పార్టీలు వారి అడుగులకు మడుగులు వత్తుతున్నాయని తెలిపారు. అన్ని పార్టీలు పోటీ చేస్తాయని భావించామని, కానీ రాహుల్ గాంధీ, కేసీఆర్‌లు పోటీ చేయకుండా మజ్లిస్‌కు ఏకగ్రీవం చేయాలని యత్నించారని కిషన్ రెడ్డి…
Talasani Srinivas Yadav : జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా మారాయి. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శోభన్ రెడ్డిలపై అవిశ్వాస తీర్మానం దాఖలవ్వొచ్చనే ఉహాగానాలు రాజుకుంటున్నాయి. పాలక మండలి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు స్ట్రాటజీలు రచిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించాలని భావిస్తోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మేయర్,…
BJP Celebrations: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఢిల్లీ ఎన్నికల విజయోత్సవ సంబరాలు నేడు (ఆదివారం) ఘనంగా జరిగాయి. గతంలో సికింద్రాబాద్‌లో బీజేపీ కార్యకర్త మృతి చెందడంతో విజయోత్సవాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. బీజేపీ కార్యకర్తలు బ్యాండ్ వాయిస్తూ, టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తల ఉత్సాహం మధ్య కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి డా. లక్ష్మణ్ ప్రసంగించారు. Read Also: Kaleshwaram: కాళేశ్వరంలో…
GHMC Council : జీహెచ్ఎంసీ (GHMC) కౌన్సిల్ సమావేశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశం ఆరంభమైన కొద్దిసేపట్లోనే రసాభాసగా మారింది. మేయర్ ముందుగా బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రకటించగా, దీనికి బీఆర్ఎస్ (BRS) , బీజేపీ (BJP) కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై కాకుండా, ప్రజా సమస్యలపై మొదట చర్చించాలనే డిమాండ్‌తో ఈ రెండు పార్టీల కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు…