Hyderabad: అంబర్‌పేట్ ఎస్సై తుపాకీ మిస్టరీ వీడింది. తుపాకీ ఆచూకీ లభ్యమైంది.. ఇటీవల.. పోటీ పరీక్షల కోసం ఎస్సై భాను ప్రకాష్ విజయవాడకు వెళ్లాడు.. అక్కడ ఒక లాడ్జిలో వారం రోజులు పాటు బసచేశాడు. తనతో పాటు తుపాకీని తీసుకొని వెళ్లాడు. పోటీ పరీక్షలు రాసిన తర్వాత తుపాకీతో ఉన్న బ్యాగు కనిపించకుండా పోవడంతో హైరానా పడ్డాడు. లాడ్జీ సిబ్బందిని నిలదీసినప్పటికీ ప్రయోజనం శూన్యమైంది.. విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చి హైదరాబాద్‌కి చేరుకున్నాడు.
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంలో ఒకరు సైబర్ చీటర్స్ బారిన పడినట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కేటుగాళ్లు “డిజిటల్ అరెస్ట్” పేరుతో ట్రాప్ చేసి తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని ఆ విషయాన్ని స్వయంగా నాగార్జున వెల్లడించారు. ఈ రోజు (సోమవారం, నవంబర్ 17) హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను నాగార్జున పంచుకున్నారు. ఐ-బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ వివరాలను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి…
Farmhouse Party: వీకెండ్ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌజ్‌లలో పండగ వాతావరణం ఉంటోంది. ఆట, పాటలు, మందు పార్టీలతో యువత హోరెత్తిస్తున్నారు. సందట్లో సడేమియా అంటూ డ్రగ్స్, గంజాయి పార్టీలు సైతం నిర్వహిస్తున్నారు. ఐతే ఇన్నాళ్లూ యువతే ఈ పార్టీలు ఎక్కువగా చేసుకునే వారు. తాజాగా ఆ పార్టీల్లోకి మైనర్లు సైతం దిగుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ప్రకటన చూసి.. మైనర్లు పార్టీకి హాజరయ్యారు. పైగా గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసులో…