Suspicious Death: మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డికి చెందిన రాగుల వంశిత అనే 16 ఏళ్ల విద్యార్థిని ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో నారాయణ కాలేజీలో చేరింది.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మూడు పథకాలను ప్రారంభించనున్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీ, కుల వృత్తులు లక్ష రూపాయల ఆర్థిక సహాయం, గృహలక్ష్మి పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
NTR Ghat: టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు.
Kishan Reddy: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రారంభోత్సవానికి తెలంగణ గవర్నర్ తమిళిసైని బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే బీఆర్ఎస్తో బీజేపీ వాదించే పరిస్థితి లేదని అన్నారు.
TS SSC Results: ఏప్రిల్ 10వ తేదీ బుధవారం 10వ తరగతి ఫలితాలు విడుదలైన విషయం అందరికీ తెలిసిందే.అయితే 10వ తరగతి పేపర్ లీకేజీ కేసులో డిబార్ అయిన విద్యార్థి హరీష్ ఫలితాలను అధికారులు హోల్డ్‌లో పెట్టారు. బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో హన్మకొండ పేపర్ లీక్ కేసులో హరీష్ అనే విద్యార్థి ఫలితాలను అధికారులు నిలిపివేశారు. దీంతో తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు.
హైదరాబాద్ లో ఓ ర్యాపిడో డ్రైవర్ సకాలంలో స్పందించడం వల్ల ఆరేళ్ల జీవితాన్ని రక్షించింది. మరికాసేపట్లో రేపిస్ట్ చేతిలో నలిగిపోయే పసి కూనను ఆ ర్యాపిడో డ్రైవర్ కాపాడాడు. ఆ పాపకు తాను తండ్రినంటూ దుండగుడు బుకాయించే ప్రయత్నం చేయగా.. అతన్ని బెదిరించి పోలీసులకు ఫోన్ చేసి పాపను కాపాడాడు.
New police stations: హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్ శాఖ తమ పావులు కలుపుతుంది. ఇప్పటికే భారీ స్థాయిలో సిబ్బందిని పెంచిన సరైన రీతిలో ఫలితాలు రావడం లేదు.
RTC Kala Bhavan: టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌ను టీఎస్ఆర్టీసీ సీజ్ చేసింది. సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో లీజు ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది.
హైదరాబాద్ లో ఓ గర్భిణి హాస్పటల్ లోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. నిన్న (గురువారం) ఉదయం స్నానం కోసం బాత్రూంలోకి వెళ్లిన కల్పన ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయింది. దీంతో తల్లిదండ్రులు ఆమెనే గాంధీ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు కల్పనకు చికిత్స అందిస్తుండగా ఒక్కసారిగా ఫిట్స్, గుండెపోటుకు గురయ్యింది.