Rangareddy: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో మైనర్ బాలుడి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలుడు రాజా పాశ్వాన్ ను చంపింది పంకజ్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో పంకజ్ పాశ్వాన్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. తన భార్యను మైనర్ బాలుడు రాజా పాశ్వాన్ కత్తితో బెదిరించి అత్యాచారం చేసి చంపేశాడని నిందితుడు పంకజ్ పాశ్వాన్ ఆరోపించాడు.
మైనర్ బాలుడు రాజా పాశ్వాన్ (17) కొన్ని నెలల క్రితం బీహార్ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చాడు. మైలార్ దేవ్ పల్లి లక్ష్మి గూడ హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నాడు. కాటేదాన్ ఇండస్ట్రీవాడలోని ఓ స్క్రాప్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 26న సాయంత్రం కంపెనీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన రాజా పాశ్వాన్ ఇంటికి తిరిగి రాలేదు. దీని తర్వాత రాజా పాశ్వాన్ తల్లిదండ్రులు కంపెనీలో విచారించగా వారు అక్కడికి రాలేదని చెప్పారు. మరోవైపు రాజా పాశ్వాన్ కోసం పలు ప్రాంతాల్లో వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. అయితే ఆదివారం లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో రాజా పాశ్వాన్ మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే రాజా పాశ్వాన్‌ను హత్య చేసింది పంకజ్‌గా గుర్తించారు. రాజాను అత్యంత కిరాతకంగా గొంతుకోసి చంపిన పంకజ్‌ని ఆ తర్వాత నిర్జన ప్రాంతంలో పడేసినట్లు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి పంకజ్‌ని అరెస్టు చేశారు. అయితే ఆ బాలుడు తన భార్యను కత్తితో బెదిరించి అత్యాచారం చేసి చంపేశాడని నిందితుడు పంకజ్ పోలీసులకు తెలపడంతో షాక్ తిన్నారు. పంకజ్ మరి ఈ విషయం పోలీసులకు చెప్పకుండా పాశ్వాన్ ను ఎందుకు హత్య చేశాడు. రాజా పాశ్వాన్, పంకజ్ భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే పంకజ్ ఇద్దరిని చంపి ఇలా కథలు అల్లుతున్నాడా? అనేకోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Viral News: ఇదేందీ ఇది.. ఎప్పుడు సూడలే.. బిర్యానీని ఇలా కూడా చేస్తారా?