మాస్ మహారాజా రవితేజ తన 76వ చిత్రం ‘RT 76’తో మరోసారి సినీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా రేపు (జూన్ 5, 2025) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమంతో ప్రారంభం కానుంది. రవితేజ ట్రేడ్‌మార్క్ స్టైల్‌తో కూడిన హై-ఎనర్జీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుందని నిర్మాతలు ప్రకటించారు. సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ రామారావు ఆన్…