RT 76: రవితేజతో డిజాస్టర్ కొట్టిన నిర్మాత మరో సినిమా.. రేపే ఓపెనింగ్
- RT 76 సినిమా సెట్
- రవితేజతో ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరి సినిమా
- రేపే ఓపెనింగ్ అండ్ పూజా కార్యక్రమం
- రవితేజ స్టైల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ తన 76వ చిత్రం ‘RT 76’తో మరోసారి సినీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా రేపు (జూన్ 5, 2025) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమంతో ప్రారంభం కానుంది. రవితేజ ట్రేడ్‌మార్క్ స్టైల్‌తో కూడిన హై-ఎనర్జీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుందని నిర్మాతలు ప్రకటించారు. సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేశారు.
Also Read:Asian Max: బాలాపూర్‌లో ఏషియన్ మ్యాక్స్ థియేటర్ కాంప్లెక్స్ ప్రారంభం
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ఈ కొత్త సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా రవితేజ మాస్ అప్పీల్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌లను హైలైట్ చేసేలా రూపొందనుంది. ‘RT 76’ చిత్రం రేపు హైదరాబాద్‌లో జరిగే పూజా కార్యక్రమంతో అధికారికంగా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ కార్యక్రమంలో రవితేజ, నిర్మాత సుధాకర్ చెరుకూరి, దర్శకుడు కిషోర్ తిరుమలతో పాటు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సినిమా రవితేజ అభిమానులకు ఒక ఫుల్-ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా ఉంటుందని, ఆయన సిగ్నేచర్ స్టైల్‌తో పాటు కామెడీ, యాక్షన్, డ్రామా అంశాలను సమపాళ్లలో అందిస్తుందని ఇన్ సైడ్ టాక్.
Also Read:NTR-RCB: ఇది కదా గిఫ్ట్ అంటే?
ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్‌లు నటించనున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ, వారి పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై గతంలో ‘దసరా’, ‘రామారావ్ ఆన్ డ్యూటీ’, ‘పడి పడి లేచే మనసు’ వంటి విభిన్న చిత్రాలను నిర్మించారు. ముందు సినిమాలు బోల్తా పడినా ‘దసరా’ మాత్రం 2023లో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా ₹121 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..