Operation Abhyas: అత్యవసర పరిస్థితుల్లో ప్రజల చొరవ, సహాయక సంస్థల సమన్వయం ఎంతో అవసరం. దీనికోసం ప్రభుత్వం తరచూ నిర్వహించే విధానాలే మాక్ డ్రిల్స్. అంటే,అనుకోని ప్రమాదాలు, ఉగ్రదాడులు, సహజ విపత్తులు వంటి సందర్భాల్లో ఎలా స్పందించాలి, ఎవరెవరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాల్లో ముందస్తుగా ప్రాక్టీస్ చేసే కార్యక్రమాలు. ఇందులో ప్రభుత్వ విభాగాలు, సహాయక బృందాలు, ప్రజలు కలిసి పాల్గొంటారు. ఇక ప్రస్తుతం పాకిస్తాన్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ…
యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, పాకిస్థాన్ పాలకులు కలవర పాటుకు గురవుతున్నారు. యుద్ధం వచ్చేసిందని, ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గంటలు ఘడియలతో సహా యుద్ధం ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పేస్తున్నారు. ముహూర్తాలు పెట్టేస్తున్నారు. అణు హెచ్చరికలు చేస్తున్నారు. అణ్వాయుధాలు తమ వద్ద మాత్రమే ఉన్నట్లు ప్రగల్బాలు పోతున్నారు. నిజానికి, భారత దేశం వద్ద పాక్ కంటే శక్తివంతమైన యుధాలు ఉన్నాయి. ఒక్క అణ్వాయుధాలే…