బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాటను మరోసారి నిలబెట్టుకున్నారు. చిన్నారులు సోషల్ మీడియాలో పంపిన ఆహ్వానానికి ఫిదా అయిన కేటీఆర్.. ఆదివారం పాఠశాల వార్షికోత్సవానికి వెళ్లి వారిని ఆనందపరిచారు. తనకు వీడియో ద్వారా ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన చిన్నారులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తనతో పాటు సోఫాలో కూర్చొబెట్టుకుని మరీ కాసేపు ముచట్లు చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకొని సంతోషం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్‌లోని హైదరాబాద్ మిలీనియం పాఠశాల మూడో వార్షికోత్సవం…