భారతదేశంలో ప్రముఖ ఆరోగ్య సేవల సంస్థగా పేరుగాంచిన కేర్ హాస్పిటల్స్, తమ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా డాక్టర్ పవన్ కుమార్‌ను నియమించినట్లు ప్రకటించింది.
మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మిస్టర్ హరీష్ రావు.. మీలాగా మాటలు కాదు, చేతల ప్రభుత్వం మాది అని విమర్శించారు. విద్యా, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాం అని, శంకుస్థాపన స్థాయిలో వదిలి వెళ్లిపోయిన హాస్పిటల్స్ ఈ 21 నెలల్లో వేగంగా నిర్మిస్తున్నాం అని అన్నారు. మీ ప్రభుత్వం 40 వేల కోట్ల బకాయి పెట్టిపోతే.. తాము చెల్లిస్తున్నాంఅని మండిపడ్డారు. నిత్యం మా ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష…
నిమ్స్‌లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది.
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీ ఆస్పత్రిని సందర్శించి పేషెంట్లు, అటెండెంట్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆస్పత్రిలో డ్రైనేజ్ సమస్య, ఎలక్ట్రిసిటీ, ఫైర్ సర్వీసులు, నర్సింగ్ విభాగంలో కొరతలు ఉన్నాయని గుర్తించామని తెలిపారు.
తెలంగాణలో ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిగా పేరు పొందిన నానక్‌రాంగూడలోని స్టార్ హాస్పిటల్స్, వరల్డ్ లివర్ డే 2025 సందర్భంగా స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ అధ్వర్యంలో “లివర్ హెల్త్ ఇనిషియేటివ్”ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం నానక్‌రాంగూడలోని స్టార్ హాస్పిటల్స్ 10వ అంతస్తులో ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమై, ఆరోగ్య నిపుణులు, రోగులు, మరియు కమ్యూనిటీ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు ప్రత్యేక లివర్ క్లినిక్‌లు ప్రారంభించబడ్డాయి, ఇవి కాలేయ సంబంధిత వ్యాధులను…