తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి కురిసిన వర్షం నగర వాసులను వణికించింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా కుండపోత వర్షం పడింది. భారీగా కురిసిన వానతో రోడ్లు కాలువలను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై చెరువులను తలపించాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని నాలాలు పొంగిపొర్లాయి. నాలాల్లో పడి పలువురు కొట్టుకుపోయారు. ఆసిఫ్ నగర్ అఫ్జల్ సాగర్ మంగారు బస్తిలో విషాదం చోటుచేసుకుంది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి…