తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి కురిసిన వర్షం నగర వాసులను వణికించింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా కుండపోత వర్షం పడింది. భారీగా కురిసిన వానతో రోడ్లు కాలువలను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై చెరువులను తలపించాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని నాలాలు పొంగిపొర్లాయి. నాలాల్లో పడి పలువురు కొట్టుకుపోయారు. ఆసిఫ్ నగర్ అఫ్జల్ సాగర్ మంగారు బస్తిలో విషాదం చోటుచేసుకుంది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇద్దరు గల్లంతయ్యారు. అఫ్జల్ సాగర్ నాలాను దాటే సమయంలో అదుపుతప్పి అందులో పడిపోయి మామ అల్లుడు కొట్టుకుపోయారు.
Also Read:Hyd Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ప్రాణనష్టం, జలమయమైన వీధులు
నాలాలో కొట్టుకపోయిన వారిని రాము, అర్జున్ గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ టీమ్స్ ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇద్దరికీ వివాహం అయినట్లు సమాచారం. ఇద్దరు కూడా మద్యం మత్తులో ఉన్నారు.. వర్షం పడుతున్నప్పటికీ లేవలేదు.. ఆ మద్యం మత్తులోనే నాలాని దాటే ప్రయత్నం చేయగా అందులో పడి కొట్టుకుపోయారని స్థానికులు చెబుతున్నారు. ముషీరాబాద్ వినోదనగర్ లో నాలో యువకుడు కొట్టుకుపోయాడు. దినేష్ (సన్నీ) 21గా గుర్తించారు. భార్య అనుష. ఒక కుమారుడు. ప్రైవేటు ఉద్యోగి. ముషీరాబాద్ వినోబా నగర్ నివాసి. వరద నీటిలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి ఇప్పటివరకు దొరకలేదు. అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.