HCA Elections 2023 Results Out Today: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలు మొదలయ్యాయి. ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో హెచ్‌సీఏ ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు పోలింగ్ జరగనుంది. ఇక సాయంత్రం 6 గంటలలోపు ఫలితాలు వెలువడే అవకాశముంది. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ పర్యవేక్షణలో జరుగుతున్న హెచ్‌సీఏ ఎన్నికలకు అధికారులు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త…