హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఢిల్లీతో ఈ నెల 15వ తేదీన ఆరంభమయ్యే మ్యాచ్ కోసం హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీ బుధవారం 15 మందితో సభ్యుల కూడిన జట్టును ప్రకటించింది. అందులో తిలక్ వర్మను కెప్టెన్‌గా, రాహుల్ సింగ్ ను వైస్ కెప్టెన్‌గా నియమించింది.
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు జగన్మోహన్‌రావుపై మల్కాజ్‌గిరి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కేసులో కీలకమైన రిమాండ్ రిపోర్ట్ ఎన్టీవీ చేతికి చేరింది. ఈ రిపోర్ట్‌లో చోటుచేసుకున్న నకిలీ పత్రాలు, ఫోర్జరీలు, నిధుల దుర్వినియోగం, పత్రాలపై సంతకాల ఫోర్జరీ లాంటి అంశాలు హచ్ఛగా వెలుగులోకి వచ్చాయి. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మే 2024 కంటే ముందే జరిగిన ఘటనల నేపథ్యంలో, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి…
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్ ఇచ్చింది.. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏకు అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలు జారీ చేశారు.. తాజాగా ఈ అంశంపై అజారుద్దీన్ స్పందించారు. ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
HCA-SRH : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) , సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య కొనసాగుతున్న వివాదానికి శుభం కార్డు పడింది. బీసీసీఐ, హెచ్‌సీఏ, ఎస్ఆర్‌హెచ్ మధ్య జరిగిన ట్రైపార్టీ ఒప్పందం మేరకు ఇరు వర్గాలు పరస్పర అంగీకారంతో ముందుకు సాగేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు ఎలాంటి ఆటంకం ఉండకూడదని హెచ్‌సీఏ స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం ప్రధాన అంశాలు: కాంప్లిమెంటరీ పాసులు: పాత ఒప్పందం ప్రకారమే…
SRH vs RR: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్ నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది. నేడు ఉప్పల్ వేదికగా మధ్యాహ్నం 3:30కి సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇక మ్యాచ్ టాస్ లో భాగంగా.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్. దానితో సన్ రైజర్స్…