Aman Rao Double Century: విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ క్రికెటర్ మెరిశాడు.. హైదరాబాద్ ఓపెనర్ అమన్ రావు హిస్టరీ క్రియేట్ చేశాడు.. ఈ రోజు రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో అమన్ తన కెరీర్‌లో అతిపెద్ద మైలురాయిని సాధించాడు. అజేయ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.. అంతేకాదు, ఈ టోర్నమెంట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి హైదరాబాద్ బ్యాట్స్‌మన్ కూడా అమన్ కావడం మరో విశేషం.. 154 బంతులు ఎదుర్కొన్న అమన్.. 13 సిక్సర్లు, 12 ఫోర్లతో అజేయంగా 200 పరుగులు చేశాడు. చివరి బంతికి సిక్స్ కొట్టడం ద్వారా అమన్ తన డబుల్ సెంచరీని పూర్తి చేశాడు..
Read Also: Chiranjeevi: సంక్రాంతి ముందే ‘మెగా’ సునామీ: లక్షల్లో చిరు సినిమా టికెట్లు!
అయితే, తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు.. అమన్ రావ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ తో 352/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. అమన్ స్టార్ బౌలర్లు మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్ మరియు ఆకాష్ దీప్ లతో కూడిన బెంగాల్ బౌలింగ్ దాడిని పూర్తిగా బద్దలు కొట్టాడు. ఈ ముగ్గురు బౌలర్లు భారతదేశం తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించారు. అమన్ రావ్ ఫాస్ట్ బౌలర్లపై నిర్భయంగా బ్యాటింగ్ చేసి, షమీ, ముఖేష్, ఆకాష్ దీప్‌లపై ఒంటరిగా 120 పరుగులు చేశాడు, ఇందులో 8 సిక్సర్లు ఉన్నాయి.
ఆది నుంచి దూకుడుగా ఆడాడు అమన్.. 65 బంతుల్లో అర్ధ సెంచరీ, 108 పరుగుల వద్ద సెంచరీ పూర్తి చేసిన ఈ క్రికెటర్.. ఆ తర్వాత కేవలం 46 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సీనియర్ క్రికెట్‌లో అమన్ రావుకు ఇది తొలి సెంచరీ కూడా.. టోర్నమెంట్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో అతను 39 మరియు 13 పరుగులు చేశాడు, కానీ, అతను చరిత్ర సృష్టించినది మూడవ మ్యాచ్‌లోనే. లిస్ట్ ఏ క్రికెట్‌లో హైదరాబాద్ తరపున అమన్ రావ్ చేసిన 200 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇది తొమ్మిదవ డబుల్ సెంచరీ, ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీ సీజన్‌లో రెండవ డబుల్ సెంచరీ.. గతంలో సౌరాష్ట్రపై ఒడిశాకు చెందిన స్వస్తిక్ సమల్ చేసిన 212 పరుగులు అత్యధికం..
ఇక, విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీలు ఎవరు చేశారంటే..
* 277 – ఎన్. జగదీషన్ (తమిళనాడు) వర్సెస్ అరుణాచల్ ప్రదేశ్
* 227 – పృథ్వీ షా (ముంబై) వర్సెస్ పుదుచ్చేరి
* 220 – రుతురాజ్ గైక్వాడ్ (మహారాష్ట్ర) వర్సెస్ ఉత్తరప్రదేశ్
* 212 – సంజూ సామ్సన్.. (ఒడిశా) vs సౌరాష్ట్ర
* 203 – యశస్వి జైస్వాల్ (ముంబై) vs జార్ఖండ్
* 202 – కర్ణ్ కౌశల్ (ఉత్తరాఖండ్) vs సిక్కిం
* 200 – సమర్థ్ వ్యాస్ (సౌరాష్ట్ర) vs మణిపూర్
* 200 – అమన్ రావ్ (హైదరాబాద్) vs