Corporate Connections: భాగ్య నగరంలో అత్యంత భాగ్యమంతులతో ఒక హైలెవల్ క్లబ్ ఏర్పాటైంది. ఆ అత్యున్నత వేదిక పేరు.. కార్పొరేట్ కనెక్షన్స్. ఇందులో.. వంద కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన బిజినెస్‌మ్యాన్‌లకే చోటు లభిస్తుంది. ఇన్విటేషన్ ఉన్నవాళ్లకి, వెరిఫికేషన్ అయిన అనంతరం మాత్రమే ఈ క్లబ్‌లో సభ్యత్వం కల్పిస్తారు.
MosChip: హైదరాబాద్‌లోని టెక్నాలజీ కంపెనీ ‘మాస్ చిప్’.. 52 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని నమోదుచేసింది. గత నెలతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. నిరుడు ఇదే టైమ్‌లో ఈ సంస్థ 39 కోట్లకు పైగా మాత్రమే రెవెన్యూని ఆర్జించింది. దీంతో పోల్చితే ఈసారి 33 శాతం అధిక ఆదాయాన్ని సొంతం చేసుకుంది. అయితే.. రెవెన్యూ పెరిగినప్పటికీ నికర లాభం మాత్రం తగ్గిందని మాస్ చిప్ పేర్కొంది. నెట్ ప్రాఫిట్.. కోటీ 60 లక్షల రూపాయల నుంచి…
Sai Silks (Kalamandir): హైదరాబాద్‌లోని శారీ రిటైలర్ సంస్థ సాయి సిల్క్స్ కళామందిర్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానుంది. తద్వారా 12 వందల కోట్ల రూపాయల నిధుల సమీకరణ దిశగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కోసం వెయిట్ చేస్తోంది. ఇక మీదట ఫ్రాంచైజీ విధానంలో బిజినెస్‌ను విస్తరించాలనుకుంటోంది. ఈ కంపెనీకి ఇప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో సొంతగా 50 రిటైల్ స్టోర్లు ఉండగా రానున్న రెండేళ్లలో మరో 25 స్టోర్లను…
Made in Hyderabad Guns: హైదరాబాద్‌లో తుపాకులు తదితర చిన్న రక్షణ ఆయుధాల తయారీ ప్రారంభంకానుంది. ఈ మేరకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ కంపెనీ ఐకామ్.. UAEకి చెందిన ఎడ్జ్ గ్రూప్ కంపెనీ కారకాల్‌తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా మన దేశ రక్షణ దళాల కోసం లోకల్‌గా చిన్న ఆయుధాలను తయారుచేయటమే కాకుండా ఎగుమతులు కూడా చేస్తుంది.