Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపింది. అరైవల్స్ వద్ద వదిలివేసిన బ్యాగ్‌ను గుర్తించిన సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగ్ కారణంగా కొంతసేపు ఎయిర్‌పోర్ట్‌లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించింది. తనిఖీల అనంతరం బ్యాగ్‌లో ఎలాంటి ప్రమాదకర పదార్థాలు లేవని తేలింది.