Without Ticket Flight Journey: సాధారణంగా రైలు లేదా బస్సు ప్రయాణాల్లో కొంత వయస్సు గల పిల్లలకు విడిగా టికెట్ అవసరం ఉండదు. దాంతో విమానంలో కూడా తమ మనవడికి టికెట్ అక్కర్లేదని ఒక మహిళ భావించింది. దీనితో ఆమె తనకి, తన కుమారుడికి మాత్రమే టికెట్లు తీసుకుంది. చిన్నారి కావడంతో మనవడికి మాత్రం టికెట్ తీసుకోలేదు.
Arijith Singh : మ్యూజిక్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్.. సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అర్జిత్ సింగ్!
అధికారులకు సమాచారం ఇచ్చిన ఎయిర్ హోస్టెస్..
శంషాబాద్ విమానాశ్రయం లోపల తనిఖీల సమయంలో ఎవరూ పెద్దగా గమనించకపోవడంతో.. వారు నేరుగా విమానం కూడా ఎక్కేశారు. విమానం ఎక్కిన తరువాత సైతం విషయం అంత తేలికగా గుర్తించలేదు. బస్సు, రైళ్లలో ఖాళీ సీట్లు దొరికినట్లుగా ఖాళీగా ఉన్న ఒక సీట్లో బాలుడిని కూర్చోబెట్టారు. అయితే ఆ సీటు టికెట్ తీసుకున్న ప్యాసెంజర్ రావడంతో అసలు కథ బయటకు వచ్చింది. బాలుడికి టికెట్ తీసుకోలేదనే విషయాన్ని గుర్తించిన ఎయిర్ హోస్టెస్ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది.
Road Accident: అతివేగం.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి..!
తమకు ఏమీ తెలియదన్న కుటుంబం:
అధికారులు తక్షణమే స్పందించి ఆ మహిళను, ఆమె కుమారుడితో పాటు బాలుడ్ని విమానం నుండి కిందకు దించుతూ పోలీసులకు వారిని అప్పగించారు. తాము బిహార్ లోని పాట్నాకు వెళ్తున్నామని చెప్పారు. అయితే తొలిసారి విమానం ఎక్కామని, చిన్న పిల్లలకు కూడా విమానంలో టికెట్ తీసుకోవాలనే విషయం తెలియదని పోలీసుల విచారణలో వారు తెలిపారు. వారి అమాయకత్వం, తెలియకపోవడంతో అలా విమానం ఎక్కారని గమనించిన పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసు నమోదు చేయకుండానే వారిని వదిలేసినట్లు తెలుస్తోంది. అయితే బాలుడికి టికెట్ తీసుకోలేదు. కానీ వారిద్దర్నీ కిందకు దించడంతో విమాన టికెట్ నగదు వృథా అయిపోయింది. తెలియక చేసినా తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకున్నారు.