Road Accident at Madapur: ప్రదం ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ప్రమాదాలు జరగకుండా అధికారలు చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. మద్యం మత్తులో కారు నడపకూడదని చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. ఈ తరహా ప్రయాణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. కానీ.. దాని ద్వారా వారు జైలు పాలు అవుతారని మాత్రం మరుస్తున్నారు. మరి కొందరైనా అతి తెలివి ఉపయోగింది. ప్రమాదం చేసి ఏమీ ఎరగ నట్లు వ్యవహరిస్తుంటారు. ప్రమాదాలు చేసి అందులో వారి ప్రమేమం…
హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడి బర్త్‌డే పార్టీ ఫ్లెక్సీలను చిన్నపిల్లలతో కట్టించాడు. అయితే ఫ్లెక్సీలను కడుతున్న సమయంలో ఇద్దరు చిన్నారులు కరెంట్‌షాక్‌కు గురయ్యారు. దీంతో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. చిన్నారులను పరీక్షించిన వైద్యులు ఓ పిల్లవాడికి చేతులను తీసివేశారు. అయితే మరో పిల్లాడి కాళ్లు, పొట్టభాగంలో తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. పిల్లల పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.…
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైలార్ దేవ్ పల్లి వినాయకనగర్ బస్తీలోని పరుపుల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. మంటలను చూసిన స్థానికులు అర్ధరాత్రి ఇంట్లో నుండి బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగ కమ్మేయడంతో బస్తీ వాసులు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు.…
రాజేంద్రనగర్‌లో 7 సంవత్సరాల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. హైదర్ గూడ న్యూ ఫ్రెండ్స్ కాలనీ కొండల్ రెడ్డి అపార్ట్‌మెంట్ లో నివాసం ఉంటున్న అనీష్ అనే బాలుడు అపార్ట్‌మెంట్ సమీపంలో ఆడుకుంటున్నాడు. అయితే మధ్యాహ్నం 1 గంట నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు సాయంత్రం గుర్తించి హుటాహుటిన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది బృందాలుగా ఏర్పడి బాలుడి…