Wipro: అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల వర్క్ పాలసీని కఠినతరం చేస్తున్నాయి. తాజాగా విప్రో కూడా తన ఉద్యోగులకు ‘‘హైబ్రీడ్ వర్క్ పాలసీ’’ని మరింత కఠినతరం చేసింది. ఇకపై ఉద్యోగులు ఆఫీసుకు వచ్చే రోజుల్లో, కనీసం 6 గంటలు ఖచ్చితంగా ఆఫీస్‌లో ఉండాలని ఆదేశించింది. ఉద్యోగులు 3 రోజులు ఆఫీసుకు, మరో మూడు రోజులు ‘‘వర్క్ ఫ్రం హోమ్’’ను విప్రో ఇప్పటికే అమలు చేస్తోంది.
వర్క్ ఫ్రమ్ హోమ్ కు స్వస్తి పలకాలనే ఉద్ధేశ్యంతో ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఉద్యోగులను ఆఫీస్ కు రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీస్ కు రావాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ తేల్చి చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐటీ ఉద్యోగులను ఎలాగైనా ఆఫీసులకు రప్పించాలని ఐటీ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. వారంలో ఖచ్చితంగా మూడు రోజులు ఆఫీస్ కు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాయి. ఈ విధానాన్ని మూడు దశల్లో…