తెలంగాణలో కొత్త రాజకీయ కూటమికి హుజురాబాద్ వేదిక కాబోతుందా? ఉద్యమాలలో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన పక్షాలు.. ఎన్నికల్లో కలిసి పోతాయా? విపక్ష ఓట్లు చీలకుండా.. కాంగ్రెస్ గేమ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? విపక్ష ఓటు బ్యాంక్ చీలకుండా కాంగ్రెస్ ఎత్తుగడ..! హుజురాబాద్ ఉపఎన్నికలో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని వెళ్లాలని చూస్తోంది తెలంగాణ కాంగ్రెస్. అభ్యర్ధి ఎంపికతోపాటు.. వ్యూహాత్మకంగా ఈ అంశంపైనా ఫోకస్ పెట్టింది. గతంలో జరిగిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపక్షానికి వచ్చిన ఓట్ల…
హుజురాబాద్ బైఎలక్షన్ ఆ ఇద్దరు మంత్రులకు పరీక్షేనా? వారి రాజకీయ భవిష్యత్ ఉపఎన్నిక ఫలితంపై ఆధారపడి ఉందా? అందుకే కంటిపై కునుకు లేకుండా పోయిందా? గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇంతకీ ఎవరా మంత్రులు.. ఏమా కథా? హుజురాబాద్‌లో ఇద్దరు మంత్రులపై ఎక్కువ చర్చ..! హుజురాబాద్ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా ఉపఎన్నికల్లో నిలబెట్టుకోవాలన్నది అధికార టీఆర్‌ఎస్ ఆలోచన. ఈటల రాజేందర్ రాజీనామాను ఆమోదించిన మరుక్షణం గులాబీ శ్రేణులు ఇక్కడ మోహరించి పక్కా వ్యూహంతో వెళ్తున్నాయి. షెడ్యూల్…
కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన వినాశనం ఇంకా మన కళ్లలో మెదులుతూనే ఉంది. ఆ పాపంలో ప్రభుత్వాల పాత్ర కూడా ఉంది. ఎన్నికల సభలు సూపర్ స్ప్రెడర్స్ గా మారాయి. తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదలకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కూడా ఒక కారణం. ఇప్పుడు థర్డ్ వేవ్ పొంచి ఉన్న సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతోంది. హుజూరాబాద్‌లో ప్రధాన ప్రత్యర్థులు ప్రచార వేగం పెంచారు. నేతల వెంట జనం గుంపులు గంపులుగా తిరుగుతున్నారు.…
కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు మొత్తం హుజురాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక ఈ మధ్యే హుజురాబాద్ ఎన్నిక షెడ్యూల్ విడుదల కాగా నేడు నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. ఈ విషయం పై ఆర్డీవో రిటర్నింగ్ అధికారి రవిందర్ రెడ్డి మాట్లాడుతూ… హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ ఈరోజు నుండి ప్రారంభం అవుతుంది. అయితే నామినేషన్ వేసే అభ్యర్థి తో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంది. 11 నుండి మూడు…
తెలంగాణలో ఈటల రాజీనామా తర్వాత రాష్ట్ర రాజకీయాలు మొత్తం హుజురాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. అయితే నేడు హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈరోజు నుండి ఈనెల 8 వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అయితే కోవిడ్ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లేందుకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇక అభ్యర్థులు…
అధికారంలో ఉన్నప్పుడు వారంతా చక్రం తిప్పారు. పైగా పార్టీలో సీనియర్లు. ప్రస్తుతం అనేక సవాళ్లు ఆహ్వానిస్తున్నా.. చప్పుడు చేయరు. హుజురాబాద్ ఉపఎన్నికపైనా నాన్చుడే. అన్నింటికీ తామే అని చెప్పే నేతలు..ఈ విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు? హుజురాబాద్‌ను పీసీసీ చీఫ్ సీరియస్‌గా తీసుకున్నారా లేదా? హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ప్రచార హోరులో కాంగ్రెస్ జెండా కనిపించడం లేదు. ఇంకా పాత కాలపు ఎత్తుగడలే. హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించడానికీ కాంగ్రెస్ నానా తంటాలు పడుతుంది. కొండా సురేఖ…
హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అందరి చూపు ఈ నియోజకవర్గంపైనే పడింది. సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా ఈ ఉప ఎన్నిక మారిపోయింది. రేసులో ఎంతమంది ఉన్నా వారంతా థర్డ్ ప్లేసుకోసమో పోటీ పడాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హుజూరాబాద్ లో గెలిచేది టీఆర్ఎస్ లేదంటే బీజేపీ అభ్యర్థి మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నిక రిజల్ట్ ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈటల రాజేందర్ అసైన్డ్…
గత కొన్ని నెలలుగా హుజూరాబాద్ …రాష్ట్ర రాజకీయ కేంద్రంగా మారింది. ఈటెల ఎపిసోడ్‌తో ప్రారంభమైన పొలిటికల్ హీట్ వేవ్, షెడ్యూల్ విడుదలతో పీక్ కి చేరింది. హుజురాబాద్ ఉప ఎన్నికను రెండు పార్టీల మధ్య పోరాటంగా జనం భావించట్లేదు. ఈటెల వర్సెస్ కేసీఆర్‌గానే చూస్తున్నారు. రాజకీయ పరిశీలకులు కూడా ఈ మాటే అంటున్నారు. అందుకే ఇది ఈటెల వర్సెస్ కేసీఆర్ గా మారింది. అరుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన ఈటెలకు గ్రామ గ్రామాన అనుచర వర్గం వుంది.…
త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులకు ప్రతి ఓటూ కీలకమే. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగనున్న ఈ పోరులో ఎవరు గెలిచినా పెద్ద మెజార్టీ రాకపోవచ్చు. వందల ఓట్ల తేడానే ఉంటుందని పరిశీలకు బావిస్తున్నారు. దుబ్బాక కన్నా ఇంకా టఫ్ ఫైట్ ఉంటుందని బావిస్తున్నారు. నిరుడు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన రావు, టీఆర్‌ఎస్ క్యాండిడేట్ సోలిపేట సుజాతా రెడ్డి మధ్య జరిగిన హోరీ హోరీ…
హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పోటీ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం? అధికార TRSని ఢీకొట్టడం సాధ్యమా..? ఈటలను కాదని కాంగ్రెస్ పైచెయ్యి సాధించడం ఈజీయేనా? కొండా… కాంగ్రెస్‌కి కొండంత అండ ఇవ్వగలరా? కొండా సురేఖ అభ్యర్థి అయితే కాంగ్రెస్ ఓటు చెదిరిపోదని లెక్కలు..! హుజురాబాద్ ఉపఎన్నిక కాంగ్రెస్‌కి సవాల్. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితిలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు తక్కువ. గెలవలేనప్పుడు గౌరవప్రదమైన ఓటు బ్యాంకైనా సాధించి తీరాలి. పైగా టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఈటల రాజేందర్‌తోపాటు…