ఈ రోజు బెంగాల్ ల్లో మమత గెలిచింది. రేపు మత తత్వ బీజేపీ కి హుజురాబాద్ లో స్థానం లేదని చెప్పాలి అని మంత్రి హరీష్ రావు అన్నారు. లెఫ్ట్ అన్న ఈటల రాజేందర్ రైటీస్ట్ గా ఎలా బీజేపీలో చేరారు… నల్లా చట్టాలు అని చెప్పిన ఈటల రాజేందర్ ఆ పార్టీలో ఎలా చేరారు అని ప్రశ్నించిన ఆయన స్వార్థం కోసం బీజేపీలో చేరారు ఈటల రాజేందర్ అని తెలిపారు. ఇక తెలంగాణ పట్ల బీజేపీ…
హుజూరాబాద్ ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ… హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కరెన్సీని గెలిపిస్తారా? బీజేపీ కాషాయం జెండాను గేలిపిస్తారా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ఉద్యమ కారుడు మంచి నాయకుడు. ఆయన ఉద్యమ స్ఫూర్తిని హుజూరాబాద్ లో నింపారు. ఇక్కడి ప్రజలు చైతన్యం కలిగిన ప్రజలు. అయితేప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచు కున్న నేత ఈటల రాజేందర్. ఆయన కల్మషం లేని బోలా మనిషి ఆయనకు అన్యాయం చేస్తే…
హుజురాబాద్ ఉపఎన్నికలో హోరాహోరీగా తలపడుతున్న టీఆర్ఎస్, బీజేపీ లెక్కలేంటి? ఎవరు ఏం అంశాలపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు? వారి అంచనాలు పోలింగ్ నాటికి వర్కవుట్ అవుతాయా? ఇన్నాళ్టి ప్రచారంలో బీజేపీ, టీఆర్ఎస్ సాధించింది ఏంటి? గడియారం గిర్రున తిరుగుతోంది. హుజురాబాద్‌లో పోలింగ్‌కు నెల రోజుల సమయం కూడా లేదు. పార్టీల వ్యూహాల స్పీడ్ పెరిగింది. ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. నాలుగు నెలలుగా హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం హోరెత్తిస్తోన్న ఈ రెండు పార్టీలు.. ఇప్పుడు మరిన్ని శక్తులను మోహరిస్తున్నాయి.…
హుజూరాబాద్ ఉప ఎన్నిక హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. అధికార, విపక్ష నేతలు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ మంత్రి ఈటలను ఎలాగైనా ఓడించాలని అధికార టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈటల రాజేందర్ అదేస్థాయిలో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. కేసీఆర్ అహంకారానికి.. హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి పోటీగా అభివర్ణిస్తున్నారు. తాజాగా ఈటల రాజేందర్ కు మద్దతుగా, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి లేఖ రాసారు. హుజూరాబాద్ ఓటరుగా మీకు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే…
ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసిండు అంటే ఆస్తులు కాపాడుకోడానికి అని మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా కమలాపూర్ మండలంలో ఆయన మాట్లాడుతూ… తెరాస పార్టీకి ఓటేస్తే న్యాయం జరుగుతుందా, బీజేపీ పార్టీకి ఓటేస్తే న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ రైతులకు అన్యాయం చేస్తుంది.బావుల కాడా మోటర్లకు మీటర్ల పెట్టమంటుంది,మార్కెట్ వ్యవస్థ రద్దు చేస్తా అంటుంది. కేసీఆర్ కుడి చేత్తో ఇస్తే,ఎడమ చేత్తో బీజేపీ గుంజుకుంటుంది. ఈనాడు ఈటల రాజేందర్ రైతుల ఉసురు…
హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన కామెంట్స్ చర్చగా మారాయి. ఆయన ఎందుకు ఆ ప్రకటన చేశారు? అప్పట్లో GHMC ఎన్నికల్లో పార్టీ ఎత్తుకున్న టోన్‌నే ఇప్పుడు కొత్తగా అందుకున్నారా? లేక.. ప్రత్యర్థిపార్టీ ముందరి కాళ్లకు బంధాలేసే వ్యూహమా? ఇంతకీ కొప్పుల ఏమన్నారు? హుజురాబాద్‌లో కొప్పుల కామెంట్స్‌పై చర్చ..! షెడ్యూల్ విడుదలతో హుజురాబాద్‌లో ఎన్నికల హీట్ అమాంతం పెరిగింది. ఎన్నికల వ్యూహాలకు ప్రధాన పార్టీలు మరింత పదును పెడుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి అస్త్రాలు బయటకు…
హుజురాబాద్ ఉపఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో నాయకుల హడావుడి మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 8వరకు కొనసాగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది అక్టోబర్ 13. పోలింగ్ 30న జరుగనుండగా ఫలితం నవంబర్ 2న వెలువనుందని ఈసీ ప్రకటించింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. నేడు కూడా పలు పార్టీల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో…
హుజురాబాద్ ఉప ఎన్నికల సీఎం కేసీఆర్ ప్రతిష్టకు సవాలుగా మారింది. అలాగే ఈటెల రాజేందర్‌కు కూడా ఇది అగ్నిపరీక్ష. దాంతో ఇక్కడ ఎవరు జెండా ఎగరేస్తారన్నది ఆసక్తిగా మారింది. గులాబీదళం.. కమలదళం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అధికార పార్టీ నియోజకవర్గాన్ని నిధులతో ముంచెత్తుతోంది. కోట్ల వ్యయంతో దళితబంధు ప్రోగ్రామ్ తెచ్చింది. అలా దళిత ఓటర్లకు దగ్గరవుతుంది. అందులో అనుమానం లేదు. ఇక ఈటెల బీసీ వర్గానికి చెందిన వారు కాబట్టి..టీఆర్‌ఎస్ కూడా యాదవ కులస్తుడు గెల్లు…
హుజురాబాద్ అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహారం నడిపిస్తోందా? సీరియస్ ఫైట్ ఇస్తుందా.. ఇంకెవరికైనా సాయపడాలని చూస్తోందా? మాజీ మంత్రి కొండా సురేఖ ఎందుకు బరి నుంచి తప్పుకొన్నారు? పార్టీ ముందు డిమాండ్ల చిట్టా పెట్టిన కొండా సురేఖ?చివరకు పోటీకి విముఖత వ్యక్తం చేసిన సురేఖ..! హజురాబాద్‌లో నామినేషన్ల ఘట్టం మొదలైనా.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియదు. అభ్యర్ధి ఎంపిక కసరత్తును కొలిక్కి తెచ్చే పనిలో పడింది పార్టీ. మొదటి నుంచీ మాజీ మంత్రి కొండా సురేఖను…
ఎట్టకేలకు హుజురాబాద్ ఉపఎన్నికల్లో తమ అభ్యర్థిని దాదాపు ఖరారు చేసింది కాంగ్రెస్. బలమూర్ వెంకట్ పేరును ఫైనల్ చేశారు. ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశముంది. గెల్లు శ్రీనివాస్ కు బలమైన పోటీ ఇవ్వడానికి బలమూర్ వెంకట్ ను రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం.ప్రస్తుతం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వెంకట్ కాంగ్రెస్ నుండి యూత్ లీడర్ గా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు…బలమూర్ వెంకట్.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వాడు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్…