గత 5 నెలల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఉప ఎన్నికల నోటిషికేషన్ వచ్చిననాటి నుంచి అధికార టీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి ప్రజలను ఎంతవరకు ఒప్పించారనేది ఈ రోజుతో తేలనుంది. ఓటర్లు మెచ్చిన లీడర్ ఎవరో నేటి ఓట్ల లెక్కింపుతో బయట పడనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం ఈవీఏంలను కూడా ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలోనే ఏర్పాటు చేసిన…