Cambodia-Thailand:ఈ ఏడాది కంబోడియా, థాయిలాండ్ మధ్య చిన్నపాటి యుద్ధమే సాగింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్య తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. ఇదిలా ఉంటే, థాయిలాండ్ ఇప్పటికీ తమపై ‘‘మానసిక యుద్ధం’’ కొనసాగిస్తోందని కంబోడియా ఆరోపిస్తోంది. కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్ ఈ ఆరోపణలు చేశారు. జూలై నెలలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరింది. అయినప్పటికీ, థాయిలాండ్ మానసిక యుద్ధంలో పాల్గొంటోందని కంబోడియా మానవ హక్కుల కమిషన్ ఆరోపించింది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రధాన మంత్రిగా.. ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు కంటిన్యూగా ఒక్కరే కొనసాగడం కష్టం. కానీ ఆ దేశానికి అతను ఏకంగా 40 ఏళ్లుగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.