కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది. సిట్ గుర్తించిన 13 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపేందుకు రంగంలోకి దిగింది. తాజాగా బంగాలగుడ్డ ప్రాంతంలో ఏడవ రోజైన మంగళవారం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తవ్వకం పనులను ముమ్మరం చేసింది. ఇప్పటివరకు, ఈ ఆపరేషన్లో భాగంగా దాదాపు 100 ఎముకల అవశేషాలు వెలికితీయబడ్డాయి. దీనితో పాటు, సైట్ నంబర్ 6,…