ప్రయివేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్న తల్లిదండ్రులు మరియు విద్యార్థులకు త్వరలో కొంత ఉపశమనం కలుగనుంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోగా, అందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 21న మంత్రుల బృందంతో కూడిన మంత్రివర్గ సబ్ కమిటీ సమావేశం కానుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సహా సబ్‌కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించిన…