ఎన్ని కఠిన చట్టాలొచ్చినా... భద్రతా ఏర్పాట్లు ఎంత కట్టుదిట్టం చేసినా స్మగ్లర్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. నిఘా అధికారులు డేగ కళ్లతో పర్యవేక్షిస్తున్నా గంజాయి స్మగ్లింగ్ ఆగడం లేదు. తాజాగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది.
ముంబై అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.39 కోట్ల విలువ చేసే 39 కేజీల విదేశీ గంజాయిను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ముంబైకు తరలిస్తుండగా స్మగ్లింగ్ ముఠాను అధికారులు వల పన్ని పట్టుకున్నారు.