ఇదిలా ఉంటే దేశంలోనే అత్యంత మురికి నగరంగా పశ్చిమబెంగాల్ లోని హౌరా నగరం నిలిచింది. లక్ష కన్నా ఎక్కువ జనాభా ఉన్న 10 మురికి నగరాలు పశ్చిమబెంగాల్ లోనే ఉన్నాయి.
Kolkata Metro Runs Under River, First In India: కోల్‌కతా మెట్రో రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలో తొలిసారిగా నదీ గర్భం నుంచి మెట్రో రైల్ పరుగులు తీసింది. హుగ్లీ నది నుంచి ఏర్పాటు చేసిన సొరంగం గుండా మెట్రో రైల్ పరుగులు పెట్టింది. ఈ విషయాన్ని బుధవారం సీనియర్ అధికారి వెల్లడించారు. అధికారులు, ఇంజనీర్లతో కూడిన మెట్రో రైల్ హుగ్లీ నది కింద నుంచి కోల్‌కతా నుండి నదికి అవతలి వైపున హౌరా వరకు…
రామ నవమి వేడుకల్లో ఓ వ్యక్తి పిస్టల్ తో హల్ చల్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటన పశ్చిమబెంగల్ లో జరిగింది. హౌరాలో రామనవమి ఊరేగింపు సందర్భంగా 22 ఏళ్ల యువకుడిని మంగళవారం పిస్టల్‌తో పట్టుకున్న వీడియో వైరల్ కావడంతో అరెస్టు చేశారు.
Ram Navami violence: శ్రీరామ నవమి రోజు ఆరు రాష్ట్రాల్లో హింసాకాండ జరిగింది. శ్రీరాముడి ఊరేగింపు సమయంలో రెండు వర్గాల వారు ఒకరిపైఒకరు దాడులు చేసుకోవడం, రాళ్లు రువ్వడం వంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించగా.. చాలా మంది గాయపడ్డారు. మహరాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్ లో మరొకరు మరణించారు. మహరాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో హింసాకాండ చెలరేగింది.
Arrest of two terrorists associated with ISIS: నిషేధిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న ఇద్దరు వ్యక్తులను పశ్చిమబెంగాల్ హౌరాలో అరెస్ట్ చేశారు. కోల్‌కతా పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) పశ్చిమ బెంగాల్ లోని హౌరా నుంచి ఐసిస్ తో సంబంధం ఉన్న ఎండీ సద్దాం (28), సయీద్ (30)లను శుక్రవారం అరెస్ట్ చేసింది. స్థానిక కోర్టు వీరిని జనవరి 19 వరకు పోలీస్ కస్టడీకి పంపింది. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో వీరిద్దరినీ…
పశ్చిమబెంగాల్‌లో కల్తీసారా ఏడుగురిని కబళించింది. హౌరాలో కల్తీసారా సేవించి 7 మంది మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. హౌరాలో ఓ బస్తీలో ఈ ఘటన జరిగింది.
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం దేశవ్యాప్తంగా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. దేశంలోని నగరాలు, పట్టణాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. భాజపా మాజీ అధికార ప్రతినిధులు నుపుర్‌శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌ను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో బెంగాల్‌లో రెండో రోజు కూడా అల్లర్లు జరిగాయి. హౌరా…