జమ్మూకాశ్మీర్‌ను వరదలు విడిచిపెట్టడం లేదు. కనీసం తేరుకోకముందే దెబ్బ మీద దెబ్బతో క్లౌడ్ బరస్ట్‌లతో ప్రజలను బెంబేలెత్తించేస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు.. వరదలతో తిండి తిప్పలు లేక అల్లాడిపోతుంటే.. వరుస క్లౌడ్ బరస్ట్‌లతో ప్రజలు అతలాకుతలం అయిపోతున్నారు.
సిక్కింలో భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలాగే కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే జనజీవనం కూడా అస్తవ్యస్తమైంది.