చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం జరిగింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై కొందరు దాడి చేయగా ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని కొడుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పలమనేరు పాతపేట పోలీస్ లైన్ వీధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నిరంజన్ నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో ఒకే వీధిలో కాపురం ఉంటున్న ఎదురెదురు ఇళ్ల మధ్య గొడవ జరిగింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి నిరంజన్‌పై దాడి కోసం ఎదురింటి వ్యక్తి ఓ గ్యాంగ్‌ను రంగంలోకి…