ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన అమ్మాయిలకి మాయమాటలు చెప్పి వారి నుంచి డబ్బులు బంగారం కాజేస్తున్న కిలాడీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు హైదరాబాద్‌కు చెందిన కీలారు నాగ తేజగా గుర్తించారు. నిందితుడు నాలుగు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన విజయవాడకు చెందిన యువతని ఏకాంతంగా మాట్లాడాలని హోటల్‌కి తీసుకు వెళ్ళాడు.