ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మైనారిటీలే లక్ష్యంగా రాజధాని కాబూల్ నగరంలోని కార్తే పర్వాన్ ప్రాంతంలోని గురుద్వారాను టార్గెట్ చేశారు. శనివారం ఉదయం కార్తే పర్వాన్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో హిందువులు, సిక్కులు చిక్కుపోయినట్లు తెలుస్తోంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 8.30 గంటలకు దాడి జరిగింది. గురుద్వారాకు గార్డుగా ఉన్న వ్యక్తిని చంపేశారు ఉగ్రవాదులు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా కార్తే పర్వాన్ గురుద్వారా సమీపంలో పేలుడు సంభవించింది. గురుద్వారా ద్వారం…