మనం జీవితంలో అనేక వార్తలు చదువుతుంటాం. కానీ కొన్ని వార్తలు మనలో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరికొన్ని భయాందోళనలకు గురయ్యేలా చేస్తాయి. ఈమధ్యే ఈజిప్టులో ఓ ఆస్పత్రిలో జరిగిన సంఘటన అవాక్కయ్యేలా చేసింది. చిన్నప్పుడు మనం ఆడుకుంటూ.. బలపం, చిన్న చిన్న వస్తువులు మింగేసి ఉంటాం. ఆ తర్వాత వాటిని వైద్యులు నానా కష్టాలు పడి తీసేవారు. కానీ ఓ రోగికి ఏమైందో తెలీదు గానీ ఏకంగా ఓ మొబైల్ ఫోన్ మింగేశాడు. తర్వాత అతను కడుపునొప్పితో నానా కష్టాలు పడ్డాడు. హాస్పిటల్ లోని వైద్యులు ఒక రోగికి చికిత్స చేసి ఆ మొబైల్ బయటకు తీశారు.
అతని కడుపులో మొత్తం ఫోన్ కనిపించడంతో వైద్యులకు మైండ్ బ్లాంక్ అయింది. ఈజిప్ట్‌కు చెందిన ఒక వ్యక్తి ఆరు నెలల క్రితం పొరపాటుగా ఫోన్‌ను మింగేశాడు. అతను వైద్య సహాయం కోసం చాలా ఇబ్బందిపడ్డాడు. ఆ ఫోన్ కడుపులోనే ఉండడమే కాదు అది తన ప్రతాపం చూపించింది.
శరీరం గుండా ఆహారాన్ని సరిగా వెళ్ళకుండా ఫోన్ ఆపేసింది. కొన్ని రోజుల తరువాత అతను కడుపు నొప్పి భరించలేకపోయాడు. చివరకు వైద్యులను సందర్శించాడు. వైద్యులు అతని కడుపులో ఎక్స్-రే స్కాన్ చేశారు. ఈజిప్టులోని అస్వాన్ నగరంలోని ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. అయితే అతను కోలుకుంటున్నాడు. మింగేసిన ఫోన్ మూడు భాగాలుగా విడిపోయింది. బ్యాటరీ అతని కడుపులో పేలిపోతుందని వైద్యులు టెన్షన్ పడ్డారట. చివరికి ఆపరేషన్ సక్సెస్ అయింది. అయితే, ఫోన్ ఎందుకు మింగింది మాత్రం అతను సెలవివ్వలేదు.