యుక్త వయస్కులలో ఉండే వారిలో కనిపించే సాధారణ సమస్య మొటిమలు. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, కాలుష్యం వల్ల ముఖంపై మొటిమలు ఏర్పడుతాయి. మొటిమలను పోగొట్టుకునేందు కోసం.. మార్కెట్లో దొరికే ఎన్నో రకాలైన క్రీములు, సబ్బులు వాడుతుంటారు. అయినప్పటికీ.. అవి నయం కావు, అంతేకాకుండా మొటిమల్ల వల్ల నల్లటి మచ్చలు ఏర్పడుతాయి.