Beauty: ముఖంపై మొటిమలు, మచ్చలతో దరిద్రంగా ఉందా..? ఇంట్లో లభించే ఇవి వాడండి
- యుక్త వయస్కులో ఉన్న వారిలో కనిపించే సాధారణ సమస్య మొటిమలు
- ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, కాలుష్యం వల్ల ముఖంపై మొటిమలు
- మొటిమలను పోగొట్టుకునేందు కోసం క్రీములు, సబ్బుల వాడకం
- మొటిమల్ల వల్ల నల్లటి మచ్చలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యుక్త వయస్కులలో ఉండే వారిలో కనిపించే సాధారణ సమస్య మొటిమలు. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, కాలుష్యం వల్ల ముఖంపై మొటిమలు ఏర్పడుతాయి. మొటిమలను పోగొట్టుకునేందు కోసం.. మార్కెట్లో దొరికే ఎన్నో రకాలైన క్రీములు, సబ్బులు వాడుతుంటారు. అయినప్పటికీ.. అవి నయం కావు, అంతేకాకుండా మొటిమల్ల వల్ల నల్లటి మచ్చలు ఏర్పడుతాయి. అయితే.. మొటిమలు, మచ్చలను పోగొట్టే కొన్ని సహజ మూలికలు (స్కిన్ కేర్ హెర్బ్స్) ఉన్నాయి. ఇవి వాడటం వల్ల చర్మం సురక్షితంగా (నేచురల్ స్కిన్ కేర్)గా తయారవుతుంది.
మొటిమలకు ఉపయోగించే స్కిన్ కేర్ హెర్బ్స్:
వేప: వేప ఆకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడతాయి. వేప పేస్ట్ లేదా వేప నూనెను నేరుగా మొటిమల మీద అప్లై చేస్తే ప్రభావవంతంగా పని చేస్తుంది.
Also Read
పసుపు: పసుపులో కర్కుమిన్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో.. చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. పసుపు పేస్ట్‌ను పెరుగు లేదా తేనెతో కలిపి అప్లై చేసుకోవచ్చు.
తులసి: తులసిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది మొటిమల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. తులసి ఆకుల రసం లేదా పేస్ట్ మొటిమల మీద అప్లై చేసుకోవచ్చు.
అలోవెరా: అలోవెరాలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది మొటిమలను తగ్గించడానికి, చర్మాన్ని తేమగా మార్చడానికి సహాయపడుతుంది. అలోవెరా జెల్‌ను నేరుగా మొటిమల మీద అప్లై చేసుకోవచ్చు.
చందనం: గంధంలో శీతలీకరణ, మెత్తగాపాడిన గుణాలు ఉంటాయి. ఇది మంటను తగ్గించి, చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. చందనం పేస్ట్‌ని రోజ్ వాటర్‌లో కలిపి అప్లై చేసుకోవచ్చు.
మెంతులు: మెంతిగింజలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి.. మొటిమల మచ్చలను తగ్గిస్తుంది. మెంతి గింజలను పేస్టులా చేసి మొటిమల మీద అప్లై చేసుకోవాలి.
నోట్ : ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
Toyota Innova Hycross Facelift: 360 డిగ్రీ కెమెరా, Wi-Fi, డ్యాష్‌క్యామ్‌తో ఇన్నోవా హైక్రాస్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?
-
Germany: జర్మనీలో జెన్-జీ అల్లర్లు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు, పెట్రోల్ బాంబులు!
-
Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరి మృతి..
-
Rahul Gandhi: ‘‘ర్యాలీకి రండి.. షాపింగ్ కూడా చేయండి’’.. రాహుల్ గాంధీ పిలుపు..
-
State Election Commissioner: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి: ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!