మహిళల రక్షణ విషయంలో పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలని ఏపీ హోంమంత్రి అనిత ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కలిగి ఉందని.. విద్య, సాధికారత, భద్రత విషయంలో రాజీ ఉండదన్నారు.
అండర్-19 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ సాధించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హోంమంత్రి వంగలపూడి అనిత అభినందనలు తెలిపారు. మేటి జట్లను మట్టి కరిపించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన అద్భుతమైన సందర్భంలో మన తెలుగు తేజాలు.. విశాఖకు చెందిన షబ్నమ్ షకీల్, తెలంగాణకు చెందిన గొంగడి త్రిష పాత్ర మరువలేనిదని కొనియాడారు.
గత ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఐదేళ్లలో అన్నీ వ్యవస్థలు భ్రష్టు పట్టాయని విమర్శించారు..పోలీసులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించటంలో గత ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.. అయితే, టెక్నాలజీని ఉపయోగించుకోవటంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకోవాలన్నారు..
బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ కూడా తయారవుతోందన్నారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ.. గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.. బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ కూడా తయారవుతోంది.. యాంటీ నార్కొటిక్ టీంను ఏర్పాటు చేశాం.. అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం అన్నారు.
పులివెందుల ఎమ్మెల్యే నోటి నుంచీ వినకూడని మాటలు వస్తున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. రాజకీయాలలో ఎవరున్నా.. మా కుటుంబ సభ్యులను సైతం నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి మహిళా రైతులు మానసిక క్షోభకు గురయ్యారన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత సమావేశమయ్యారు. హోంమంత్రిపై పవన్ వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు - పోలీసుల రియాక్షన్‌పై పవన్ ఇటీవల అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ.. రెండూ ఉండాలి అంటూ డ్రైనింగ్ పూర్తి చేసుకున్న డీఎస్పీలకు సూచించారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు.. ఇదే సమయంలో.. శాంతి భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.
తిరుపతి జిల్లా వడమాలపేటలో హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. అనంతరం వారికి.. పది లక్షల చెక్కును అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చిన్నారిపై అఘాయిత్యం బాదేసింది.. చాక్లెట్ కొనిస్తానని అత్యాచారం చేసి హత్య చేయడం మరింత బాధించిందని తెలిపారు. అలిమేలు మంగాపురం ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది.. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో పంచాయితీ రాజ్ ప్రభుత్వ గెస్ట్ హౌస్ వద్ద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీని హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బలోపేతం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.