Cyber Fraud: ఫేస్ బుక్ పరిచయం కొంపముంచింది. తక్కువ వడ్డీకే హౌస్ లోన్ ఇప్పిస్తానని ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. బాధితుడు వద్ద నుంచి రూ.70వేలు కాజేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో లబోదిబో మంటూ బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.