ప్రపంచీకరణతో సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఇప్పుడే కాదు ఎల్లలు లేని కళలు ఏ నాడో సాగరాలు దాటి సందడి చేస్తున్నాయి. ఈ సమయంలో మరింతగా కళలు కళకళలాడే పరిస్థితి ఏర్పడింది. సకల కళలకు వేదికగా నిలచిన సినిమా రంగం ఉత్తర, దక్షిణ – తూర్పు, పడమర భేదాలను తుడిచివేయనుందని పరిశీలకులు ఘోషిస్తున్నారు. ప్రపంచ సినిమాను శాసించిన ‘హాలీవుడ్’ చూపు ప్రస్తుతం భారతదేశం వైపు సాగుతోంది. ఇప్పుదే కాదు, తమ కళలకు, కథలకు అనువైన వాతావరణం కోసం హాలీవుడ్ పలుమార్లు…