Los Angeles Wildfires: లాస్ ఏంజెలెస్‌లో గల హాలీవుడ్‌లోని ఐకానిక్ నిర్మాణాలను కార్చిచ్చు కాల్చి బూడిద చేసే ప్రమాదం ఉంది. ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే ప్రఖ్యాత డాల్బీ థియేటర్‌ను కూడా అగ్నిమాపక శాఖ అధికారులు ఖాళీ చేయించారు. దీంతో ప్రస్తుతం పరిస్థితితో ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది.