Delhi : దేశ రాజధానిలో దోమల వల్ల వచ్చే వ్యాధుల కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దోమల వల్ల వచ్చే డెంగ్యూ వ్యాధితో ఆదివారం తొలి మరణం సంభవించింది. డెంగ్యూతో బాధపడుతున్న 54 ఏళ్ల వ్యక్తి గత వారం లోక్ నాయక్ ఆసుపత్రిలో మరణించినట్లు అధికారులు తెలిపారు.
Andhra Pradesh: ఏపీలో విద్యార్థులకు విద్యాశాఖ కీలక సూచన చేసింది. ఆగస్టు 13న వర్కింగ్ డేగా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఆగస్టు 13న రెండో శనివారం సెలవును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 వరకు స్కూళ్లలో డ్యాన్స్, మ్యూజిక్, ర్యాలీలు, పెయింటింగ్, గ్రూప్ డిస్కషన్స్, జాతీయ జెండాలతో సెల్ఫీలు దిగి అప్‌లోడ్ చేయడం…
ఏపీలో మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్‌వాడీ కార్మికులు నేడు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సోమవారం సెలవును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎల్‌పీవో, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులకు సెలవు మంజూరు చేయవద్దని కలెక్టర్లు ఆయా శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసి స్కానింగ్ ప్రతులను ఉ.10:45 గంటల్లోగా ఉన్నతాధికారులకు పంపించాలని, హెడ్‌క్వార్టర్లు విడిచిపెట్టి వెళ్లరాదని ఆదేశించారు. మరోవైపు…