Hockey Worldcup: హాకీ ప్రపంచకప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. పూల్-డిలో భాగంగా శుక్రవారం స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో భారత్ విజయం సాధించింది. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్ రోహిదాస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌ను భారత్ తొలుత నెమ్మదిగా ఆరంభించింది. ఆ తర్వాత ప్రత్యర్థి గోల్‌పోస్టులపై దాడులు చేస్తూ దూకుడు పెంచింది. 11వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను జర్మన్ ప్రీత్ వృథా చేసినప్పటికీ ఆ…