టాలెంట్ ఏ ఒక్కరి సొంతం కాదు. దానికి పేదవారు…ధనవంతులతో పని లేదు. పట్టుదల..కష్టపడే తత్వం ఉంటే చాలు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జూనియర్ మహిళల హాకీప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడుతున్న ముంతాజ్ కథ అలాంటిదే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముంతాజ్‌ది ఓ నిరుపేద కుటుంబం. ఆరుగురు అక్కా చెల్లెళ్లు..ఒక సోదరుడు. తండ్రి సంపాదన అంతంత మాత్రమే. కుటుంబం గడవటానికి తల్లి కైసర్ జహాన్ తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతుంది. శుక్రవారం దక్షిణ కొరియాపై ముంతాజ్ విజృంభించి ఆడుతున్న సమయంలో ..ఇక్కడ క్నోలోని…