కేరళలో విషాదం చోటుచేసుకుంది. షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని నలుగురు మృతిచెందారు. శనివారం తిరువనంతపురం వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు సహా నలుగురు పారిశుధ్య కార్మికులు మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.