Team India: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం నాడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించగా.. నాగపూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో హైదరాబాద్‌లో జరిగే టీ20లో ఎవరు గెలిస్తే వాళ్లు సిరీస్ కైవసం చేసుకుంటారు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే చరిత్ర సృష్టించనుంది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక…
ఐర్లాండ్ పర్యటనను హార్డిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు విజయంతో ముగించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20 ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం కాగా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇవ్వడంతో 4 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు సాధించిందంటే దానికి కారణం…
లీడ్స్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో బ్యాటింగ్‌లో 100 సిక్సర్లు కొట్టి బౌలింగ్‌లో100 వికెట్లు తీసిన ఆటగాడిగా స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో స్టోక్స్ 18 పరుగులు చేశాడు. ఈ సిక్సర్‌తో టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. ఇప్పటి వరకు అతడు 81 టెస్టులు ఆడి మొత్తం…
ప్రపంచ పర్యావరణం కాపాడటమే లక్ష్యంగా, కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు పాటుపడాలనే సంకల్పంతో చేపట్టిన అంటార్కిటికా యాత్రలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వాలంటీర్‌కు చోటు దక్కింది.
పార్లమెంట్‌లో పెద్దల సభగా పేరు పొందిన రాజ్యసభపై అధికార పార్టీ బీజేపీ పట్టు బిగిస్తోంది. చరిత్రలో తొలిసారిగా రాజ్యసభలో తన బలాన్ని బీజేపీ 100 సీట్లకు పెంచుకుంది. రాజ్యసభలో ఈ స్థాయిలో సీట్లు పొందడం బీజేపీకి ఇదే తొలిసారి. గతంలో ఒక్కసారి మాత్రమే రాజ్యసభలో ఓ పార్టీ 100 కంటే ఎక్కువ సీట్లను హస్తగతం చేసుకుంది. 1990లో కాంగ్రెస్ పార్టీ ఈ ఫీట్ సాధించింది. అప్పుడు పెద్దల సభకు ఆ పార్టీ తరఫున 108 మంది సభ్యులు…
సొంతగడ్డపై టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. గత పదేళ్లుగా టీమిండియా సొంతగడ్డపై ఏ జట్టు కూడా భారత్‌ను ఓడించలేకపోయింది. ఈ నేపథ్యంలో స్వదేశంలో వరుసగా 15 సిరీస్‌లను గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. భారత్ తర్వాత స్వదేశంలో అత్యధిక టెస్ట్ సిరీస్‌లను గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆసీస్ స్వదేశంలో వరుసగా 10 టెస్ట్ సిరీస్‌లను తమ ఖాతాలో వేసుకుంది. 1994 నవంబర్ నుంచి 2000 నవంబర్ మధ్యలో ఒకసారి, 2004 జూలై నుంచి…
తెలంగాణలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో నిరుద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ అంశంపై స్పందించారు. ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తడబడిన సందర్భమే లేదని.. ఇప్పటికే 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని ఆమె గుర్తు చేశారు. మరోవైపు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాల కల్పనకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని ఆమె స్పష్టం చేశారు. అటు కేంద్రంలో ప్రధాని మోదీ రెండు కోట్ల…
తమిళనాడులో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వెల్లూరు నుంచి 37వ వార్డుగా పోటీ చేసిన డీఎంకే అభ్యర్థి ట్రాన్స్‌జెండర్ గంగానాయక్ విజయకేతనం ఎగురవేశారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఓ ట్రాన్స్‌జెండర్ విజయం సాధించడం ఇదే తొలిసారి. దీంతో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. గంగానాయక్ సామాజిక కార్యకర్తగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. దక్షిణ భారత ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. కాగా ట్రాన్స్‌జెండర్ గంగానాయక్ తల్లిదండ్రులు దినసరి కూలీలుగా పనిచేస్తుండటం…
ఇండియా పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అఖండ భారత్ 1947లో ఇండియా పాక్ దేశాలుగా విడిపోయింది. ఇండియాను హిందూస్తాన్ అని పిలిస్తే ముస్లీంలు ఉన్న దేశాన్ని పాకిస్తాన్ అని పిలుస్తున్నారు. అయితే, ప్రత్యేక దేశంగా ఏర్పడిన పాకిస్తాన్‌కు ఆ పేరు ఎలా వచ్చింది. ఎవరు నిర్ణయించారు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. 1920 వరకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహ్మద్ ఆలీ జిన్నా, కాంగ్రెస్ కు రాజీనామా చేసి బయటకు వచ్చారు. బయటకు…
ఈజిప్ట్ అనగానే మనకు పెద్ద పెద్ద పిరమిడ్‌లు, మమ్మీలు గుర్తుకు వస్తాయి. పిరమిడ్‌ల నుంచి ఎన్నో మమ్మీలను బయటకు తీసి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అయితే, ఇటీవలే మమ్మఫికేషన్ సహాయంతో సుమారు 20 వేల ఏళ్లనాటి మమ్మీకడుపులో భద్రంగా ఉన్న పిండాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. వార్సా విశ్వవిద్యాలయంకు చెందిన పరిశోధకులు సీటీ ఎక్స్ రే సహాయంతో మమ్మీ కడుపులోని పిండం అవశేషాల ఉనికిని గుర్తించారు. చనిపోయిన మహిళ ప్రసవం సమయంలో చనిపోలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. మహిళ చనిపోవడానికి…