Soaps Prices: ధరల భారంతో అల్లాడుతున్న సామాన్యులకు ఊరట లభించింది. సబ్బులు, డిటర్జెంట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ ప్రకటించింది. ప్రొడక్ట్ బట్టి 2 నుంచి 19 శాతం మేర ధరలు తగ్గించినట్లు తెలిపింది. ముడిసరకు ధరలు అదుపులోకి రావడంతో ఈ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సవరించిన ధరలు కలిగిన స్టాక్ నెలాఖరుకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హిందూస్థాన్ యూనిలీవర్ విక్రయిస్తున్న సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ 500 మిల్లీలీటర్ల…