హిందూపురం మున్సిపాలిటీలో కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. ఎట్టకేలకు మున్సిపల్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మొన్నటి వరకు మున్సిపాలిటీల్లో తిరుగులేని ఆధిక్యంతో ఉన్న వైసీపీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురు దెబ్బలు వరుసగా తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలంతా తెలుగుదేశం పార్టీ, బీజేపీలో చేరగా.. తాజాగా మున్సిపాలిటీలు కూడా టీడీపీ పరమవుతున్నాయి
బాలయ్య మంత్రాంగం ఫలించడంతో.. హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కూటమి కైవసం చేసుకోనుంది.. మున్సిపాల్టీలో మొత్తం కౌన్సిలర్ల సంఖ్య 38గా ఉండగా.. ఇప్పుడు టీడీపీ కూటమి బలం 20కి చేరింది.. దీంతో.. మున్సిపల్‌చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు ఇంద్రజ.. రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు..