Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్‌లో బలరాంపూర్‌లో జలాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బాబా ముసుగులో హిందువును, సిక్కు మతం మార్చే పెద్ద రాకెట్ ముఠాకు ఈయన నాయకత్వం వహిస్తున్న విషయాన్ని యూపీ పోలీసులు బట్టబయలు చేశారు.
Conversion racket: పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్న మతమార్పిడి ముఠాను ఆగ్రా పోలీసులు పట్టుకున్నట్లు శనివారం వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ నెట్వర్క్ సోషల్ మీడియా, లూడో స్టార్ వంటి ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారామ్స్, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లు, డార్క్ వెబ్‌లను ఉపయోగించి పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. క్రౌడ్ ఫండింగ్, క్రిప్టోకరెన్సీ ద్వారా డబ్బు లావాదేశీలు జరిగాయని అధికారులు కనుగొన్నారు.
Chhangur Baba: జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హిందూ యువతను ట్రాప్ చేసి, వారిని వివాహం చేసుకుని, ఇస్లాంలోకి మార్చాలనే పెద్ద నెట్‌వర్క్‌ను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఛేదించారు. ఈ మొత్తం కేసులో ప్రధాన సూత్రధారిగా ఛంగూర్ బాబా ఉన్నాడు. యూపీలోని నేపాల్ సరిహద్దుల్లో ఉండే బలరాంపూర్ జిల్లా మాధ్‌పూర్ కేంద్రంగా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.