Mumbai Rains: రాష్ట్రంలో వరద పరిస్థితులపై విపత్తు నిర్వహణ శాఖతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాబోయే 48 గంటలు ముంబై, థానే, రాయగడ్, రత్నగిరి, సింధుదుర్గ జిల్లాలకు చెందిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.