Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామంటూ ముంబయి పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఎన్సీపీ నేత, మాజీమంత్రి బాబా సిద్ధిఖీలాగా యూపీ సీఎంను కూడా చంపుతాం అంటూ దుండుగులు అందులో వార్నింగ్ ఇచ్చారు.
High Alert in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం ఢిల్లీ పోలీసులను నిఘా వర్గాలు అందించాయి.
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తం అయింది. భారత్- బంగ్లా సరిహద్దులో సైన్యం భారీగా మోహరించింది. దీంతో బీఎస్‌ఎఫ్ హైఅలర్ట్ ప్రకటించింది.
జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించి ఐదు సంవత్సాలు అవుతుంది. కాగా.. ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు జమ్మూ బస్టాండ్‌ను లక్ష్యంగా చేసుకున్న అనుమానాలు కనిపిస్తున్నాయి. 2019 సంవత్సరంలో జమ్మూ బస్టాండ్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాది యాసిర్ అహ్మద్ భట్.. జూలై 27 నుండి కుల్గామ్‌లోని తన ఇంటి నుండి కనిపించకుండా పోయాడు. కాగా.. అతను 2021 నుంచి బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు. ఈ క్రమంలో.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులను ఒక మహిళ చూసినట్లు నివేదించడంతో జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో.. ముందుజాగ్రత్తగా జమ్మూలోని ఆర్మీ పాఠశాలలను శనివారం వరకు మూసివేయనున్నారు. భద్రతను నిర్ధారించడానికి కీలకమైన ఆర్మీ మరియు డిఫెన్స్ ఇన్‌స్టాలేషన్‌ల వద్ద భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. పంజాబ్ పోలీసులు వారిని వెతికి పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న దృశ్యాలతో పఠాన్ కోట్‌లో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దీంతో భారత వాయుసేన కీలక స్థావరమైన పఠాన్‌కోట్‌లో హై అలర్ట్ ప్రకటించారు. బలగాలు అప్రమత్తం అయి తనిఖీలు చేపట్టాయి.
స్తుతం ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ఉదయం లేవగానే బ్రెస్ కంటే మొదట ఫోన్ ను పట్టుకుంటున్నాం. కాని షావోమీ, రెడ్‌మీ, పోకో ఫోన్లు వాడుతున్న వారికి ముప్పు పొంచి ఉందని నిపుణులు అంటున్నారు.
హైదరాబాద్ మల్కాజ్గిరిలో పోలీస్ హై అలర్ట్ నిర్వహించారు. ప్రధాని మోడీ ఈరోజు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ విజయ సంకల్ప రోడ్ షో చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ భద్రత నిర్వహించనున్నారు. మల్కాజ్గిరిలో మోడీ రోడ్ షో 1.3 కిలోమీటర్, గంట పాటు సాగనుంది. అందుకోసమని.. రెండు వేలకు పైగా10 అంచెల పోలీస్ భారీ భద్రత చేపట్టనున్నారు.
ప్రధాని మోడీ కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 7.50కు బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా సిటీలో హై అలెర్ట్ ప్రకటించారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. కాగా.. ఈరోజు రాత్రికి ప్రధాని మోడీ రాజ్ భవన్ లో బస చేయనున్నారు. అనంతరం.. రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు.