ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య వార్ మరోసారి ఉధృతం అయింది. ఇజ్రాయెల్ సైన్యమే లక్ష్యంగా హిజ్బుల్లా రెచ్చిపోయింది. ఆదివారం ఒకేసారి 250 రాకెట్లను ప్రయోగించింది. ఇరాన్ మద్దతుతో ఈ రాకెట్లను ప్రయోగించింది. లెబనాన్ సరిహద్దు ప్రాంతం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా 50 రాకెట్లను ప్రయోగించింది. ఈ రాకెట్లు గోలన్ హైట్స్‌ను తాకాయి. దీంతో ప్రైవేటు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా బుధవారం ఈ దాడి జరిగినట్లుగా సమాచారం.
ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హెజ్‌బొల్లాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రూప్ సీనియర్ కమాండర్ మహమ్మద్ నామేహ్ నజీర్‌ను వైమానిక దాడిలో ఇజ్రాయెల్ హతమార్చింది.