Hezbollah Attack: ఇజ్రాయెల్‌పైకి హెజ్‌బొల్లా ప్రతీకార దాడులు.. 200 రాకెట్లు ప్రయోగం
- ఇజ్రాయెల్‌పైకి హెజ్‌బొల్లా ప్రతీకార దాడులు
- 200 రాకెట్లు ప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హెజ్‌బొల్లాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రూప్ సీనియర్ కమాండర్ మహమ్మద్ నామేహ్ నజీర్‌ను వైమానిక దాడిలో ఇజ్రాయెల్ హతమార్చింది. దీనికి ప్రతీకారంగా ఆ దేశ సైనిక స్థావరాలే లక్ష్యంగా 200కు పైగా రాకెట్లు, 20కిపైగా ఆత్మాహుతి డ్రోన్లు ప్రయోగించినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది. గాజాలో పోరు ప్రారంభమైన తర్వాత ఈ గ్రూపు జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటి. లెబనాన్ భూభాగం నుంచి కొన్ని రాకెట్లు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయని, చాలా వాటిని కూల్చేసినట్లు టెల్‌అవీవ్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Minister Satyakumar Yadav: ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు
Also Read
- Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
- Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. హెజ్‌బొల్లా దాడుల అనంతరం ఇజ్రాయెల్ సైన్యం కూడా దక్షిణ లెబనాన్ ప్రాంతంపై విరుచుకుపడింది. రామ్యెహ్, హూలా పట్టణాల్లోని ఆ గ్రూపు మిలిటరీ నిర్మాణాలపై పెద్ద ఎత్తున దాడులు జరిపినట్లు వెల్లడించింది. హూలాపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందినట్లు లెబనాన్ వార్తా సంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్ 7న హమాస్ విధ్వంసం సృష్టించిన తర్వాత.. ఇజ్రాయెల్ పెద్దఎత్తున ప్రతి దాడులకు దిగుతోంది. హమాస్‌కు మద్దతిస్తున్న హెజ్‌బొల్లా ఉగ్రవాదులనూ లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ గ్రూపునకు ఆర్థికంగా, ఆయుధపరంగానూ ఇరాన్ సాయం చేస్తోంది.

తాజావార్తలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
-
SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
-
Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!